Breaking News

కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ట్రైలర్ రిలీజ్

Published on Sat, 10/11/2025 - 17:07

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా 'కె ర్యాంప్'. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్‍‌లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు. రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు వినిపించాయి.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి.. అమ్మాయికి వెంకటేశ్ ఫ్యామిలీతో బంధుత్వం)

ట్రైలర్ బట్టి చూస్తే.. కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమెకు సైకలాజికల్ ప్రాబమ్స్ ఉంటాయి. దీంతో తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.

చాన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. కానీ గతేడాది దీపావళికి రిలీజైన 'క' చిత్రం మాత్రమే హిట్ అయింది. ఈ ఏడాది మార్చిలో 'దిల్ రుబా' అనే మూవీతో వచ్చాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో యూత్‍‌ని టార్గెట్ చేసి 'కె ర్యాంప్' తీశాడు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి? దీపావళికి దీనితో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)