Breaking News

'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?

Published on Sun, 07/27/2025 - 16:58

గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అంటే ఒక భాషలో తీసిన సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇతర భాషలకు చెందిన నటీనటులు.. తెలుగు ఇండస్ట్రీలోకి బోలెడంత మంది వస్తూనే ఉన్నారు. తాజాగా 'కింగ్డమ్' మూవీతో మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో హైలైట్ అవ్వడంతోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఇంతకీ ఎవరితడు?

'కింగ్డమ్' మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్‪‌లో శ్రీలంకలో జరిగే స్టోరీతో తెరకెక్కుతోంది. ట్రైలర్‌తోనే కథేంటి అనేది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా హైలైట్ అయ్యాడు. అతడి పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్‌లో రెండు షాట్స్‌లోనే కనిపించాడు. ఇతడెవరా అని చూస్తే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అని తెలిసింది. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.

(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)

వెంకటేశ్.. మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్‌లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్‌గా చేశాడు. ఈ మూవీతోనే 'కింగ్డమ్' ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్‍‌కి మరో కొత్త విలన్ దొరికాడేమో అనిపిస్తుంది.

మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతమందించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు. కాకపోతే తొలి భాగం ఫలితం బట్టి అది ఆధారపడి ఉంటుందేమో?

(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీ సినిమా రివ్యూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)