Breaking News

'కింగ్డమ్' నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి: నిర్మాత

Published on Thu, 07/31/2025 - 17:17

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. కొందరు నచ్చిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నచ్చలేదని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి మిక్స్‪‌డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. ఇకపోతే తాజాగా హైదరాబాద్‌లో మూవీ సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండి అని అన్నారు.

'సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది ఇలాంటివి ఏమి పట్టించుకోకండి. ప్రతి సినిమాకు కామన్ ఇవి. సినిమా అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి హై ఇస్తుంది. మీకు నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. మూవీలోని టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి' అని నాగవంశీ అన్నారు.

(కింగ్డమ్‌ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

నిర్మాతగా ఆయన తీసిన సినిమాని నాగవంశీ మెచ్చుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పూర్తి రిజల్ట్ ఏంటనేది వీకెండ్ గడిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 'కింగ్డమ్'లో విజువల్స్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ సెకండాఫ్‌లో ల్యాగ్ ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. అలానే హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ కూడా మూవీలో లేకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయమై సక్సెస్ మీట్ నిర్మాతని అడగ్గా.. స్కోప్ లేకపోవడంతోనే పాటని పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.

'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)