Breaking News

థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా

Published on Mon, 07/22/2024 - 14:30

ఓటీటీల వల్ల సినిమా చూడటం చాలా సులభమైపోయింది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల చిత్రాల్ని సింపుల్‌గా చూసేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మూవీస్.. కొన్ని సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే రీసెంట్‌గా రిలీజై హిట్ కొట్టిన హిందీ మూవీ విషయంలో జరగనుంది.

పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హిందీ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది. 100లో ఒకటో రెండో మాత్రం ఉన్నంతలో నిలబడుతున్నాయి. అలాంటిది జూలై 5న 'కిల్' అనే మూవీ బాలీవుడ్‌లో రిలీజైంది. ఫుల్ ఆన్ యాక్షన్ కథతో తీయగా.. హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మూడో వారంలోకి వచ్చినా సరే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకురానున్నారు. సోమవారం (జూలై 22) రాత్రి 9 గంటల నుంచి 'కిల్' మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే మరీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి హిట్ సినిమా రావడం ఏంటని నెటిజన్లు అనుకుంటున్నారు.

'కిల్' విషయానికొస్తే.. అమిత్ రాథోడ్ (లక్ష‍్య లల్వానీ) ఎన్ఎస్‌జీ కమాండో. ఇతడి ప్రియురాలు తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె తండ్రి, వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేస్తాడు. దీంతో తనతో వచ్చేయాలని తులికాని అమిత్ అడగ్గా.. ఆమె నో చెబుతుంది. ఆ తర్వాత తులికా ఫ్యామిలీ.. ఢిల్లీ నుంచి రాంచీకి ట్రైన్‌లో వెళ్తుంటారు. తులికాకు తెలియకుండా అమిత్ కూడా ఇదే ట్రైన్ ఎక్కుతాడు. కాసేపటి తర్వాత బందిపోట్ల ముఠా ట్రైన్‌పై దాడి చేస్తుంది. తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు. మరి బందిపోట్ల నుంచి తులికా, ప్రయాణికులను లక్ష్య కాపాడగలిగాడా? లేదా అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)