Breaking News

విలన్‌గా సునీల్ ఎంట్రీ.. టీజర్‌ అదిరిపోయింది!

Published on Tue, 07/16/2024 - 19:37

రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్‌ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్‌ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్‌ రోనా తర్వాత సుదీప్‌ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన  టీజర్‌లో సుదీప్‌ డిఫరెంట్‌ లుట్‌లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్‌ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్‌ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)