Breaking News

ఫొటోలు వద్దు.. దీవెనలు చాలు

Published on Fri, 07/18/2025 - 15:52

హీరోయిన్ కియారా అడ్వాణీకి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి ఆమె అభిమానుల వరకు చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. మన దగ్గర తక్కువ కానీ బాలీవుడ్‌లో ఫొటోగ్రాఫర్స్ కల్చర్ చాలా ఎక్కువ. నటీనటులు ఎక్కడికెళ్లినా సరే 10-15 మంది ఫొటోలు తీస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఫొటోలు కూడా ఎవరైనా లీక్ చేస్తారేమోనని కియారా-సిద్ధార్థ్ దంపతులు ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు దాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

'మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మేం చాలా సంతోషపడుతున్నాం. తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో గోప్యత పాటించాలనుకున్నాం. అందుకే ఫొటోలు షేర్ చేయడం లేదు. మీరు కూడా దయచేసి మా పాప ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్' అని కియారా దంపతులు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

కియారా-సిద్ధార్థ్ మల్హోత్రానే కాదు బాలీవుడ్ జంటలైన అనుష్క-విరాట్, దీపిక-రణ్‌వీర్ దంపతులు కూడా ఇప్పటివరకు తమ కూతురు ఫొటోలని ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఎవరికీ పిక్స్ తీయనివ్వలేదు. ఆలియా-రణ్‪‌బీర్ దంపతులు కూడా తమ కూతురు పుట్టిన కొన్నాళ్ల వరకు బయటకు చూపించలేదు. తెలుగులోనూ చరణ్-ఉపాసన కూడా తమ కుమార్తె ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

బాలీవుడ్‌లో వేర్వేరుగా కెరీర్ మొదలుపెట్టిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రా.. 2021లో రిలీజైన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2023లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లకు పాప పుట్టింది. కియారా అడ్వాణీ నటించిన 'వార్ 2' విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌ న్యూసెన్స్‌కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి..)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)