Breaking News

సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్‌.. అమ్మ ఒప్పుకోవట్లే!: ఖుష్బూ కూతురు

Published on Sun, 04/13/2025 - 10:31

కోలీవుడ్‌ జంట ఖుష్బూ - సుందర్‌ (Khushbu - Sundar) కూతురు అవంతిక సినిమాల్లోకి రానుందని ప్రచారం ఊపందుకుంది. ఆమె గ్లామరస్‌గా ముస్తాబైన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్‌ దొరికేసిందని జనాలు ఫీలయ్యారు. తనకు కూడా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆరాటంగా ఉందట.. కానీ ఇంట్లో వాళ్లు తనను లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా లేరంటూ బుంగమూతి పెట్టింది అవంతిక.

అమ్మానాన్న రెడీగా లేరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవంతిక సుందర్‌ (Avantika Sundar) మాట్లాడుతూ.. అమ్మానాన్న నన్ను వెండితెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా లేరు. ఆ మాటకొస్తే వారి చేతులమీదుగా లాంచ్‌ అవడం నాకూ అంతగా ఇష్టం లేదనుకోండి. కానీ ఎవరో ఒకరు నాకోసం వస్తారు? లేదా నేనే సొంతంగా సినిమాల్లోకి అడుగుపెడతాను అని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారి సహాయసహకారాలు లేకుండా ఇవేవీ సాధ్యపడవు.

అమ్మను అడుగుతా..
నా పేరెంట్స్‌ వల్లే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టగలను. వారు నన్ను లాంచ్‌ చేయడానికి సుముఖత చూపించడం లేదు. నా అంతట నేను ఎదగాలన్నది వారి ఆలోచన. కానీ అందుకు వారి సహాయం కావాలి. కనీసం చిత్రపరిశ్రమకు చెందినవారిని అయినా పరిచయం చేయమని అమ్మను అడుగుతున్నాను. అలా అయినా పరిచయాలు పెంచుకుని నేనేదైనా సాధించగలను. స్టార్‌ కిడ్‌గా నాపై ఎక్కువ అంచనాలు, ఒత్తిడి ఉంటాయని పేరెంట్స్‌ చెప్పారు. నేను వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రిపరేషన్‌ కోసం లండన్‌లో డ్రామా స్కూల్‌కు కూడా వెళ్లొచ్చాను. 

వాళ్లకంటే ఎక్కువ సక్సెస్‌?
అయితే నా మెదడులో ఒక ఆలోచన ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. నేనేం చేసినా నా పేరెంట్స్‌తో పోల్చకుండా ఉండలేరు. వాళ్ల కన్నా ఎక్కువ సక్సెస్‌ అవుతానని నేను చెప్పలేను కానీ నా శక్తి మేర ప్రయత్నిస్తాను. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా.. నాకు ఫెయిల్యూర్స్‌ అంటే భయం. ఓటమిని తట్టుకోలేను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌ మాత్రం.. ఫలితాన్ని పట్టించుకోకు.. దానికోసం నువ్వెంత కష్టపడ్డావు? అన్నదే ముఖ్యం అని నాకు ధైర్యం చెప్తూ ఉంటారు.

చాలాకాలంగా వెయిటింగ్‌
సినిమాల్లోకి రావాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా ఎత్తు సమస్యగా మారుతుందేమో అనిపిస్తోంది. నేను 5 అడుగుల 11 అంగుళాల పొడవున్నాను. ఒక నటి ఎలా ఉండాలో అలా లేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడైతే లావుగా కూడా ఉన్నాను. అప్పుడు స్క్రీన్‌పై హీరోయిన్లను చూసి నేను కథానాయికగా పనికి రాను అనుకున్నాను. కరోనా సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టి ఇలా మారిపోయాను అని అవంతిక చెప్పుకొచ్చింది.

 

చదవండి: విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)