'కేజీఎఫ్' తల్లి.. తెలుగు సినిమాలో హీరోయిన్‌గా

Published on Wed, 11/04/2026 - 20:11

కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఘనంగా ప్రారంభమైంది.  బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వి.వి.వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

(ఇదీ చదవండి: 'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత)

దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం దగ్గర రచయిత, అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘డెలులు’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ రాజ్ కుమార్ హీరోగా  నటిస్తుండగా.. కన్నడ చిత్రం ‘కేజీయఫ్’లో యశ్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ హీరోయిన్‌గా  నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ ఫేమ్ అతిథి మ్యూకల్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా  దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలోని మధుర క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. హైదరాబాద్, కేరళలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఈ సినిమాకు కథే అసలైన హీరో. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ గారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు అని అన్నాడు.

హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ..‘‘కన్నడలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించాను. ‘కేజీయఫ్’ చిత్రంలో యశ్ తల్లిగా నటించడం ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించడం చాలా సంతోషంగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని తెలిపింది.

(ఇదీ చదవండి: గాయపడ్డ ఎన్టీఆర్ బావమరిది.. సర్జరీ విజయవంతం)

Videos

పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు

58 ఓట్లతో YSRCP ఆధిక్యం.. తిరుపతిలో రీకౌంటింగ్ రగడ..!

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

పులివెందులలో బీటెక్ రవి కుట్రలు

రెండుసార్లు రీకౌంటింగ్ పెట్టినా.. YSRCP అభ్యర్థి విజయం..

నన్ను గెలిపించిన అనంతపురం ప్రజలకు మాటిస్తున్న..

అడ్డుకున్న పోలీసులు.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

నాకిచ్చిన బ్యాలెట్ నెంబర్ మూడు.. కానీ పేపర్ పై ఆ నెంబర్ లేదు..

గెలుపోటములు సహజం.. ఓటమిపై కోలగట్ల శ్రావణి రియాక్షన్

అయ్యా పోలీసువారు మొత్తం గెలిపించింది మీరే.. బూచేపల్లి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)

+5

'అక్క' మరో ప్రపంచంలో ఉంటే ఇలానే (ఫొటోలు)

+5

#బాలు-గీత ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)