Breaking News

దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు

Published on Sun, 08/31/2025 - 19:25

'కేజీఎఫ్' సినిమా కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. హీరో యష్‌ని పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. ఈ మూవీలో నటించిన కొందరు యాక్టర్స్ కూడా బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ ఇదే చిత్రంలో నటించిన ఓ నటుడు మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'కేజీఎఫ్' తొలి భాగంలో హీరో ముంబైలో ఉంటాడు. అతడితో పాటు ఛాఛా అనే ముస్లిం వ్యక్తి ఒకరు ఉంటారు. ఆ పాత్ర చేసిన నటుడి పేరు హరీశ్ రాయ్. చాన్నాళ్లుగా కన్నడలో సినిమాలు చేస్తున్నారు. 'కేజీఎఫ్'తో కాస్తంత ఫేమ్ వచ్చింది. అయితే రెండో పార్ట్ రిలీజైన నాటికే ఇతడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అది నాలుగో స్టేజీకి చేరింది. దీంతో నటుడు హరీశ్.. మరీ బక్కపలుచగా మారిపోయాడు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)

ప్రస్తుతం నాలుగో స్టేజీ థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హరీశ్ రాయ్.. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. దాతలు ఎవరైనా తనకు సాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నాడు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచినంత డబ్బులు ఇ‍చ్చాడు. దీనిపై స్పందించిన హరీశ్.. సదరు హీరోకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

రెండు భాగాలగా వచ్చిన 'కేజీఎఫ్'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో చేసిన సీనియర్ నటులు గత కొన్నేళ్లలో అనారోగ్య కారణాలతో చనిపోయారు. కొన్నిరోజుల ముందు కూడా శెట్టి పాత్రధారి దినేశ్ మంగళూరు.. బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. ఇప్పుడు ఛాఛా పాత్రధారి క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతుండటంతో ప్రేక్షకులు, నెటిజన్ల మనసు కలత చెందుతోంది.

(ఇదీ చదవండి: 'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)