మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
‘కేజీఎఫ్ 2’ మూవీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
Published on Mon, 04/18/2022 - 21:05
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ.
చదవండి: ఆ సీన్ చూసి కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారు: మురళీ మోహన్
ఇక కేజీఎఫ్ 2 చూసిన బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు ప్రశాంత్ నీల్, యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ 2తో భారత చలన చిత్ర పరిశ్రమకు మరో అఖండ విజయం లభించిందంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్పందనను తెలిపారట. ఈ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిచారంటూ కేజీఎఫ్ టీంను స్పెషల్‌గా ఆయన అభినందించారని విశ్లేషకుడు మనోబాల ట్వీట్ చేశాడు. రజనీ స్యయంగా కేజీఎఫ్ నిర్మాతకు ఫోన్ చేసి మూవీ బాగుందని ప్రశంసించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.
చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ మూవీ వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.552 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి!
Superstar #Rajinikanth watched #KGFChapter2 and praised the team for delivering a blockbuster movie.
— Manobala Vijayabalan (@ManobalaV) April 16, 2022
Tags : 1