Breaking News

ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?

Published on Mon, 06/09/2025 - 13:41

ఓటీటీలోకి మరో మంచి సినిమా రాబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని, రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించింది. చాన్నాళ్ల హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్.. కాస్త బూస్టప్ ఇ‍చ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.

జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా తీసిన ఈ మూవీని తొలుత హిందీలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయగా మంచి టాక్ వచ్చింది. నెల తర్వాత అంటే మే 23న తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో జూన్ 13 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన రావొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

కేసరి 2 విషయానికొస్తే.. 1919లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరాడు.

కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు లాయర్ నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష‍్మీ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)