Breaking News

ఓటీటీలో 'కేసరి చాప్టర్‌ 2' స్ట్రీమింగ్‌

Published on Fri, 06/13/2025 - 09:28

‘కేసరి చాప్టర్‌ 2’ (Kesari Chapter 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జలియన్‌ వాలాబాగ్‌ విషాదం నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 18న బాలీవుడ్‌లో విడుదలైంది. కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్‌, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్‌ జోహార్‌ నిర్మించారు.  1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. చరిత్ర గురించి తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి ఈ మూవీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. జియో హాట్‌స్టార్‌ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్‌ మరో వారంలోపు విడుదల కావచ్చు.

కథేంటంటే..
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్‌ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్‌ జనరల్‌ డయ్యర్‌ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది.

అందులో బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్‌ నాయర్‌(అక్షయ్‌ కుమార్‌) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్‌ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌(అనన్య పాండే)తో జనరల్‌ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.

డయ్యర్‌ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్‌ ఎలా డీల్‌ చేశాడు? డయ్యర్‌ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్‌ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)