ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
Published on Fri, 08/21/2026 - 06:45
తెలుగులో 'కేరింత' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన సుకృతి తల్లయింది. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మేరకు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుకుంటున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్లోనూ ఆసక్తి చూపించేది. అలా దిల్ రాజు నిర్మించిన 'కేరింత'లో భావన పాత్ర కోసం ఎంపికైంది. ఈ మూవీ హిట్ అయినా సరే అవకాశాలు రాలేదో ఆసక్తి లేదో తెలియదు గానీ మరో మూవీ చేయలేదు. యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.
ఇక నాలుగేళ్ల క్రితం అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చిన సుకృతి.. ఈ ఏడాది ఏప్రిల్లో తను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. ఇప్పుడు తనకు మగబిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చింది.
Tags : 1