Breaking News

ది కేరళ స్టోరీ సీక్వెల్.. బోల్డ్ అండ్‌ వయొలెంట్‌గా ట్రైలర్‌

Published on Tue, 02/17/2026 - 15:44

ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేరళలోని అమ్మాయిలను మత మార్పిడి చేసి గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్లిన రియల్‌ స్టోరీతో ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. . సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది.

తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ వస్తోన్న ది కేరళ స్టోరీ-2 గోల్ బియాండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే మనదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను లవ్ పేరుతో మత మార్పిడి చేసి చిత్ర హింసలకు గురి చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రియల్ సంఘటనల ఆధారంగానే రూపొందించారు. ఈ చిత్రాన్ని ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 

కాగా.. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌లో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాకు మన్నన్ షా సంగీతం అందించారు. ఈ సీక్వెల్‌ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.

కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)