Breaking News

నటి శారదకు అత్యున్నత పురస్కారం

Published on Sun, 01/18/2026 - 12:16

అభినేత్రి శారద పేరు తెలుగు పరిశ్రమలో ఎప్పటికీ చెరిగిపోని పేరు. ఆమె ఒక నట గ్రంథాలయం.   ఆరు పదుల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. ‘కల్యాశుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద..  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించి  ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు.  అయితే, శారద మాత్రం ముందు రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌ రేంజ్‌కు చేరుకున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు   పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది.  

 'జేసీ డానియల్‌ అవార్డు - 2024'కు శారద ఎంపిక 
 తాజాగా కేరళ ప్రభుత్వం శారదను గౌరవించనుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినిమా పురస్కారం 'జేసీ డానియల్‌ అవార్డు - 2024'కు ఆమె ఎంపికయ్యారు. జనవరి 25న తిరువనంతపురంలో  కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా  ఈ పురస్కారాన్ని శారద అందుకుంటారు.

ఈ వార్త తెలిసిన వెంటనే శారద స్పందించారు. ఈ అవార్డ్‌కు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తనపై మలయాళ చిత్రసీమతో పాటు అక్కడి ప్రేక్షకులు చూపిన ప్రేమను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోనని ఆమె అన్నారు. మలయాశ ప్రేక్షకులు లేకపోతే తన కెరీర్‌ లేదని పేర్కొన్నారు.  తన సినీ కెరీర్‌ ఆరంభంలో తెలుగులో  కొన్ని చిత్రాల్లో కామెడీ వేషాలు మాత్రమే దక్కాయని,  ఆ పాత్రలు కూడా ఈ అమ్మాయికి సరిగా చేయడం లేదని చాలామంది మేకర్స్‌ అన్నారని గుర్తుచేసుకున్నారు. 

సినిమా ఛాన్స్‌లు లేని సమయంలో మలయాళంలో ‘శాకుంతల’ అనే సినిమా తనకు ఊపరిపోసిందన్నారు. అలా జాతీయ అవార్డ్‌ అందుకునే రేంజ్‌కు మలయాళ పరిశ్రమ తనను తీసుకెళ్లిందని ఆమె  అన్నారు. మలయాళ ప్రముఖ దర్శక నిర్మాత కుంజాకో తన ప్రతిభను గుర్తించారని ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేనని శారద తెలిపారు. తెలుగులో  అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్‌ చౌదరి, సర్దార్‌ పాపారాయుడు, స్టాలిన్‌, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలు చేసిన సినిమాలు  ఉన్నాయి. 
 

Videos

TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్

వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు

నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్

అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..

ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్

మహిళ డ్యాన్సర్లతో మంత్రి వాసంశెట్టి డాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో

లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

Photos

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, శర్వానంద్‌ (ఫోటోలు)

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)