Breaking News

దాడి కేసులో నటుడు ఉన్ని ముకుందన్‌కు నోటీసులు

Published on Tue, 09/23/2025 - 10:20

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan)కు కేరళ కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఉన్నిముకుందన్‌పై తన మాజీ మేనేజర్‌ విపిన్‌ కుమార్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టోవినో థామస్‌ నటించిన నరివెట్ట సినిమాను ప్రశంసిస్తూ ఉన్నిముకుందన్‌ను ఆయన కించపరిచాడు. దీంతో ముకుందన్‌కు కోపం వచ్చింది. ఈ కారణంగానే విపిన్‌ కుమార్‌పై దాడి చేశాడని సమాచారం. దీంతో ఉన్ని ముకుందన్‌ తనపై దుర్భాషలాడారని, దాడి చేశారంటూ ఈ ఏడాది మే నెలలో  విపిన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విపిన్‌ కుమార్‌ ఫిర్యాదుతో ఉన్నిముకుందన్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలుగా సీసీటీవీ ఫుటేజ్‌ వీడియోను అందించారు. దీంతో తాజాగా కేరళలోని కాకనాడ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, విపిన్‌ చేసిన ఆరోపణలను ముకుందన్‌ కొట్టిపారేశారు. తాను  విపిన్ కళ్లద్దాలు మాత్రమే పగలగొట్టానని ఒప్పుకున్నారు. కానీ, మార్కో సినిమా ఫెయిల్‌ కావడంతోనే ఉన్నిముకుందన్‌ ఇలా ఒత్తిడికి లోనయ్యాడని విపిన్‌ చెప్పడం విశేషం. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)