Breaking News

దాడి కేసులో హీరోయిన్‌కు ముందస్తు బెయిల్‌

Published on Thu, 08/28/2025 - 09:55

మలయాళ నటి లక్ష్మీ మేనన్‌ (Lakshmi Menon)కు కోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలంటూ కేరళ కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్‌మీడియాలో లక్ష్మీ మేనన్‌ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. కొచ్చిలోని ఐటీ ఉద్యోగిపై తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేయడమే కాకుండా అతడిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేయగా నటి లక్ష్మీ మేనన్‌ పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

లక్ష్మీ మేనన్‌పై కేసు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం కేరళ కోర్టును సంప్రదించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆమెకు సానుకూలంగానే  ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్‌ 17వరకు ఆమెను అరెస్ట్‌ చేయకండి అంటూ పోలీసులను సూచించింది. అయితే, ఆమె స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అసలు కారణం ఏంటి..?
లక్ష్మీ మేనన్‌ వివాదంలో పోలీసులు ఇలా చెప్పారు. 'ఓ బార్‌ వద్ద లక్ష్మీ మేనన్‌, ఐటీ ఉద్యోగి టీమ్‌ మధ్య మొదట వివాదం వచ్చింది. ఇరు గ్రూపుల మధ్య మాటకుమాట పెరిగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఐటీ ఉద్యోగిని లక్ష్మీ మేనన్‌తో పాటు ఆమె స్నేహితులు వెంబడించారు. ఆపై అతడిని దాడిచేశారు.  కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)