Breaking News

బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్‌

Published on Sun, 08/17/2025 - 07:02

తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి కీర్తిసురేష్‌( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్‌  ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత కథానాయకిగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాన్‌ ఇండియా కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో జీవించి జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. అదేవిధంగా తక్కువ కాలంలోనే ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 

ఇకపోతే కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే తన బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె చేతిలో రివాల్వర్‌ రీటా, కన్నివెడి చిత్రాలు ఉన్నాయి. అయితే వివాహానంతరం కీర్తిసురేష్‌ కొత్త చిత్రాలకు కమిట్‌ కాలేదు. అయినా ఖాళీగా లేరు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 

కాగా వివాహానంతరం ఈ అమ్మడు కాస్త బరువెక్కారనే కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు. అలాంటి కామెంట్స్‌పై స్పందించిన కీర్తిసురేష్‌ పెళ్లి తర్వాత బరువు పెరిగిన విషయం నిజమేనన్నారు.. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్‌గా మారడానికి పోరాడానన్నారు. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్‌సైజ్‌  చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం సాధ్యమేనని కీర్తి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నూతన చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె తెలిపారు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)