Breaking News

మహానటిగా మెప్పించినా.. అవకాశాలు ఇవ్వలేదు: కీర్తి సురేశ్‌

Published on Tue, 10/27/2026 - 16:51

2018లో వచ్చిన ‘మహానటి’లో సావిత్రి పాత్రలో నటించి మెప్పించింది కీర్తి సురేశ్‌. ఈ సినిమాతో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. అయితే ఆ సినిమా తర్వాత ఆరు నెలల పాటు ఖాళీగా ఉండిపోయిందట.  ఆ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, ​తనకు అవకాశాలు రాకపోవడానికి కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

దర్శకనిర్మాతలు గందరగోళానికి గురయ్యారు
‘మహానటి’ తర్వాత నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలనే విషయంలో దర్శకనిర్మాతలు గందరగోళానికి గురయ్యారు. అంతకుముందులా నన్ను చూడలేకపోయారు. దీంతో కొత్త అవకాశాలు రాలేదు. అందుకే ఆ సమయంలో శరీరంపై శ్రద్ధ పెట్టడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించా. అయితే 2013 నుంచి 2018 వరకు షూటింగ్‌, తినడం, నిద్రపోవడం.. ఇదే తన దినచర్యగా ఉండేది. అప్పట్లో వ్యాయామం గురించి అసలు ఆలోచించేదాన్ని కాదు. నా ముఖమే అవకాశాలు తెచ్చిపెడుతున్నప్పుడు శరీరం గురించి ఎందుకు ఆలోచించాలనే భావన ఉండేది. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమని తెలుసుకున్నాను. అయితే ఆ సమయంలో కాస్త ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేవి’ అని  వెల్లడించింది.

‘అక్క’తో ప్రేక్షకుల ముందుకు..
ప్రస్తుతం కీర్తి సురేశ్‌ నటించిన ‘అక్క’ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌ అక్టోబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ‘మహానటి’తో తన నటనలోని మరో కోణాన్ని చూపించిన కీర్తి.. ఇప్పుడు ఎలాంటి పాత్రతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. మరోవైపు ‘జనవరి 12 విడుదల’ సినిమాలోనూ నటిస్తోంది. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)