Breaking News

ఆ డైరెక్టర్‌ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్‌

Published on Sat, 06/28/2025 - 12:23

విమర్శలు అందుకోని సెలబ్రిటీలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శలపాలవుతూనే ఉంటారు. హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కూడా అలా తిట్లు తినే ఇక్కడివరకు వచ్చిందట! ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. సుహాస్‌ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్‌ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. 

ఇప్పటికీ బాగా గుర్తు
కీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్‌ సర్‌ డైరెక్ట్‌ చేసిన మలయాళ చిత్రం(గీతాంజలి)తో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్‌ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్‌ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రిదయర్శన్‌ను కూడా అలాగే తిట్టేవాడు.

అంతదాకా తెచ్చుకోను
కానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్‌ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్‌లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే.. ఈ డైరెక్టర్‌ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే.. కానీ ఈయన ఎలా యాక్ట్‌ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది. గీతాంజలి చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన కీర్తి సురేశ్‌.. తెలుగులో నేను శైలజ, నేను లోకల్‌, మహానటి, రంగ్‌దే, దసరా, సర్కారువారిపాట వంటి పలు చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్‌ వాడే కారుకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది.

చదవండి: కన్నప్పలో ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. రచ్చ లేపిన ఫ్యాన్స్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)