Breaking News

కీర్తి సురేష్‌ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌

Published on Tue, 08/20/2024 - 09:24

మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలతో పాటు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన  ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.  ఆగష్టు 15న తమిళ్‌ వర్షన్‌ విడుదల అయింది.

రవీంద్ర విజయ్, ఎమ్మెస్‌ భాస్కర్‌ ఆనంద్‌ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్‌ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, ర‌ఘు తాత మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సంస్థ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌ను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసిన‌ట్లు  ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబ‌ర్ మొదటి వారం లేదా  సెప్టెంబర్‌ 14న ఓటీటీలో తెలుగు వర్షన్‌ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.

హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాష‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాల‌ని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)