Breaking News

ఇరవై గంటలు నాన్‌స్టాప్‌ షూట్‌లో...

Published on Wed, 08/05/2026 - 01:11

వరుస చిత్రీకరణలతో కీర్తి సురేష్‌కి సరైన నిద్ర ఉండటం లేదట. ఇటీవల నాన్‌స్టాప్‌గా ఇరవైగంటలు షూటింగ్‌లో పాల్గొన్నారామె. ఈ విషయంపై కీర్తి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ‘‘నిన్న ఉదయం ఆరు గంటలకు నా గది నుంచి బయలుదేరాను. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు గదికి చేరుకున్నాను. ఇందులో 20 గంటలు పనిలోనే ఉన్నాను. మరో గంటలో మరో షూట్‌లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది.

ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పడంలేదు. ఇంత బిజీగా పని చేయడాన్ని ఆశీర్వాదంలా భావిస్తున్నాను’’ అని కీర్తి తన ఇన్‌స్టా స్టోరీలో ఆగస్టు 3న ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోపై 41 గంటలు మేల్కొని ఉన్నానని క్యాప్షన్‌ జోడించారామె. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, కళ్యాణ్‌రామ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమాలో, ‘రౌడీ జనార్ధన’లో, తమిళంలో ‘డోరోతి’లో కీర్తి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే నాని ‘ది ప్యారడైజ్‌’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారట. హిందీలో ‘రఫ్తార్‌’ నటిస్తున్నారు కీర్తి.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)