Breaking News

ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్

Published on Wed, 11/27/2024 - 11:45

గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లు నిజమయ్యాయి. హీరోయిన్ కీర్తి సురేశ్.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ఆంటోని తట్టిళ్‌తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. బాలనటిగా చేసింది. 'నేను శైలజ' మూవీ హీరోయిన్ అయింది. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఈమె తొలి మూవీ 'బేబీ జాన్' త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధ్రువీకరించింది.

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)

కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్‌లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా.. ఆంటోని ఇంజినీరింగ్ చేసి ఖతార్‌లో కొన్నాళ్లు పనిచేసాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.

15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ల కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 11న గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందేమో!

(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి