Breaking News

కీర్తి సురేశ్‌ ఆశలన్నీ ఆ సినిమాలపైనే

Published on Sun, 08/25/2024 - 14:01

జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయితే విజయాలకంటే అపజయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరైనా తాము నటించే చిత్రాలు సక్సెస్‌ కావాలనే కోరుకుంటారు. అయితే ఒక్కొక్కసారి లెక్క తప్పుతుంది. తాజాగా నటి కీర్తిసురేశ్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిజం చెప్పాలంటే ఈమెకు విజయాలేమీ కొత్త కాదు. అయితే కోలీవుడ్‌లోనే వాటి శాతం చాలా తక్కువగా ఉందన్నది గమనార్హం. చాలా కాలం క్రితం విజయ్‌కు జంటగా నటించిన సర్కార్‌ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించిన ఆన్నాత్తే (పెద్దన్న) చిత్రం నిరాశ పరిచింది. 

ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్‌ చిత్రం సక్సెస్‌ అయ్యింది. ఆ తరువాత నటించిన సైరన్‌ చిత్రం అపజయాన్నే మిగిల్చింది. ఇకపోతే ఇటీవల ఈమె నటించిన 'రఘుతాత' చిత్రాన్ని కేజీఎఫ్‌ చిత్రాన్ని నిర్మించిన హోమ్‌బలే సంస్థ నిర్మించడం, ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తంగలాన్, డీమాంటీ కాలనీ 2 చిత్రాల మధ్య విడుదలైన రఘుతాత వసూళ్ల పరంగా వెనుకపడిపోయిందన్నది ట్రేడ్‌ వర్గాల మాట. కాగా ప్రస్తుతం బేబీజాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయిన కీర్తిసురేశ్‌ చేతిలో రివాల్వర్‌ రీటా, కన్నివెడి అనే రెండు తమిళ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు లేడీ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాలు కావడం విశేషం. బేబీ జాన్ అనే హిందీ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఈ చిత్రాలపైనే కీర్తి సురేశ్‌ ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)