Breaking News

రివాల్వర్‌ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్‌.. అప్‌డేట్‌ వచ్చేసింది!

Published on Fri, 05/03/2024 - 10:59

మాలీవుడ్‌లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్‌లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌పుల్‌ హీరోయిన్‌గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్‌లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్‌ ధావన్‌కు జంటగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్‌ అయిన తెరి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్‌ చిత్రం కీర్తిసురేశ్‌ను నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్‌ రీటా ఒకటి. ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్‌ కింగ్‌స్లీ, మైమ్‌గోపీ, సెండ్రాయిన్, స్టంట్‌ మాస్టర్‌ సూపర్‌సుబ్బరాయన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్‌ స్టూడియోస్, ది రూట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో చివరి షూటింగ్‌లో కేక్‌ కట్‌ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..  కీర్తిసురేశ్‌ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.    
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)