Breaking News

'రఘు తాత' వాళ్లకు వ్యతిరేకం కాదు: కీర్తి సురేష్‌

Published on Sun, 07/21/2024 - 16:04

రెగ్యులర్‌ కమర్షియల్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ కూడా చేస్తుంటారు హీరోయిన్‌ కీర్తీ సురేష్‌. ‘మహానటి’, ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రఘు తాత’. కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.  ఈ సినిమా టీజర్‌ విడుదలైన సమయం నుంచి పలు వివాదాలు వచ్చాయి. అయితే, తాజాగా కీర్తి వాటికి వివరణ ఇచ్చారు.

జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని 'రఘుతాత' సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్‌ ద్వారా కనిపిస్తోంది.

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. 'ఇది చాలా సంతోషకరమైన సమయం. దర్శకుడు కథ చెబుతూ చాలా చోట్ల నవ్వించాడు. హోంబలే ప్రొడక్షన్స్‌ వారు తమిళ చిత్రాలను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి.  రఘు తాత చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తూ.. హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడమేంటి  అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు. కానీ, హిందీని ఉద్దేశపూర్వకంగా ఒకరిపై విధించడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రం అని నేను చెప్పగలను. 

వివాదాస్పదం కాకుండా నవ్వించగలిగే మెయిన్ స్ట్రీమ్ సినిమా అవుతుంది.  రఘుతాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం.  సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. ఇందులో రాజకీయపరమైన వివాదాలు అంటూ ఏమీ లేవు. పూర్తిగా కామెడీ  సినిమా మాత్రమే.. ఇందులో ప‌నిచేసిన న‌టీన‌టులు అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.' అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)