Breaking News

ఇబ్బందిగా ఉన్నా నా భర్త సర్దుకుపోతాడు: కీర్తీ సురేష్‌

Published on Sat, 01/25/2025 - 07:02

సౌత్‌ ఇండియా నటి కీర్తీ సురేష్‌‌(Keerthy Suresh) చాలా లక్కీ అనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేయడం వల్లో ఏమోగానీ, కథానాయకిగానూ చాలా త్వరగా క్లిక్‌ అయ్యారు. అదేవిధంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ వెనువెంటనే రంగప్రవేశం చేసి అంతే వేగంగా విజయాలను తన ఖాతాలో వేసుకుని పాన్‌ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అంతేకాదు అతి పిన్న వయసులోనే మహానటి చిత్రంలో అద్భుతమైన హావభావాలను పలికించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అంతే స్వీడ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా నటిగా దశాబ్ద కాలంలోనే జరిగిపోయింది. 

గత ఏడాది డిసెంబర్‌ 12వ తేదీన తన 15 ఏళ్ల బాయ్‌ ఫ్రెండ్‌ ఆంటోనిని(Antony Thattil) కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకున్న ఆ వెంటనే తాను నటించిన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా ఇటీవలే తన భర్తతో హనీమూన్‌ కోసం థాయ్‌ల్యాండ్‌ వెళ్లి వచ్చిన ఈ బ్యూటీని ఒక భేటీలో కీర్తీసురేశ్‌ తన వివాహ జీవితం గురించి అగిడిన ప్రశ్నకు తాను వివాహానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే సంతోషంగా ఉన్నానని చెప్పారు. కారణం తాము సుదీర్ఘ కాలంగా డేటింగ్‌లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసన్నారు. 

అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్‌ అంటూ ఏమీ లేదని అన్నారు. తాను ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉంటుంటానని, అది తన భర్తకు కాస్త సంకటంగా ఉంటుందన్నారు. అయినా దాన్ని ఆయన ఇబ్బందిగా భావించడం లేదన్నారు. తనను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. అందువల్ల తమ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్‌ పేర్కొన్నారు. కాగా హిందీ చిత్రం బేబీ జాన్‌ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నూతన చిత్రాలేమీ అంగీకరించలేదు. కీర్తీసురేశ్‌ నటించిన రివాల్వర్‌ రీటా, కన్నివెడి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)