Breaking News

నాకిష్టమైన 'తోబుట్టువు' నువ్వే అంటూ రేర్‌ ఫోటో షేర్‌ చేసిన బ్యూటీ

Published on Tue, 03/11/2025 - 07:44

సౌత్‌ ఇండియా టాప్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి తన కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తుంది. అయితే, తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్‌ చేసిన ఈ బ్యూటీ తన అక్క రేవతి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో తన సోదరితో ఆమెకు ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది. నిర్మాత జి. సురేష్ కుమార్‌, నటి మేనకల కుమార్తెగా కీర్తి సురేశ్‌ 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగులో 'నేను శైలజ' సినిమాతో పరిచయం అయింది.

కీర్తి అక్క రేవతి సురేష్‌ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇది ఫీచర్‌ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్‌ ఫిల్మ్‌ కోసం కావడం విశేషం. అయితే, నేడు తన పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు చెబుతూ కీర్తి ఇలా పోస్ట్‌ షేర్‌ చేసింది. 'నా ఒడిదుడుకుల సమయంలో నా చుట్టూ ఒక గోడలా నిలబడ్డావు. వాటిని నేను అధిగమించేందుకు నాకు అండగా నిలిచావు. నువ్వు నా పక్కన ఉంటే చాలు.. ఈ జీవితం చాలా సులువుగా ఉంటుంది. బహుశా నాకు అత్యంత ఇష్టమైన తోబుట్టువు నువ్వే అనుకుంటా' అంటూ ఒక స్మైలీ ఎమోజీని చేర్చి తన అక్కపై ఉన్న ప్రేమను కీర్తి పంచుకుంది.

కీర్తి తల్లి మేనక నటి కాగా, ఆమె నాన్న సురేష్‌ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కీర్తి అక్క రేవతి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె తీస్తున్న ఆ షార్ట్​ ఫిల్మ్ పేరు ‘థ్యాంక్ యూ’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా కొద్దిరోజుల క్రితం వారు షేర్‌ చేశారు. రేవతి కూడా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. చెన్నై శస్త్ర యూనివర్సిటీలో ఫిలిం కోర్సులో మాస్టర్స్‌ పట్టా అందుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)