విజయాల పాట...వివాదాల బాట

Published on Wed, 03/18/2026 - 15:42

భారతీయ సినిమాల్లో మాత్రమే కనిపించే పాటలు ఓ రకంగా ఇక్కడి సినిమా విజయాలకు అత్యంత కీలకం అని తెలిసిందే. అయితే అవే పాటలు వివాదాలకు  కేంద్రబిందువవుతూ ఒక్కోసారి నిషేధాలను కూడా ఎదుర్కుంటున్న పరిస్థితికి కూడా పాటకు ఉన్నంత చరిత్ర ఉంది. ఓ వైపు సినిమా సంగీతం ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కొన్ని  కొన్ని పాటలు మళ్లీ ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా విడుదలైన సర్కే చునర్‌ తెరి సర్కే కూడా తీవ్రవివాదంలో ఇరుక్కుంది. ఈ ‘సర్కే చునర్‌ తెరి సర్కే’  అనే పాటలో నోరా ఫతేహి, సంజయ్‌దత్‌లు ప్రధానంగా కనిపిస్తారు.  అయితే ఇందులో ఉన్న అసభ్యకర మైన సాహిత్యం నృత్య భంగిమలు ఉన్నట్టుగా ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను ‘‘చీప్‌’’గా అభివర్ణిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, చివరికి యూట్యూబ్‌ నుంచి ఈ పాటను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, పాట రచయిత తదితరులపై కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన పాటలను పరిశీలిస్తే...

‘టటేరీ’ పాటతో బాద్‌షా వివాదాల బాట..
ఇదే ఏడాదిలో మ్యూజిక్‌ ఇండస్ట్రీని కుదిపేసిన మరో వివాదం టటేరీ...ఈ  పాటను ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా రూపొందించారు. పాటలోని అసభ్యకర కంటెంట్, మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యల కారణంగా తీవ్ర పాట తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శల దాడి తీవ్రతరం కావడంతో చివరకు హర్యానా స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.  పలు కేసులు నమోదయ్యాయి. చివరికి బాద్‌షా క్షమాపణలు చెప్పి పాటను డిజిటల్‌ వేదికల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేటి ఖల్‌ నాయక్‌ నాటి ఖల్‌నాయక్‌...
ఇలాంటి వివాదాలు మరీ కొత్తవేమీ కావు. గతంలో అంటే దాదాపు 3దశాబ్ధాల క్రితమే 1993లో విడుదలైన ఖల్‌నాయక్‌ సినిమాలోని చోలీకే పీఛే క్యాహై  పాట కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది.   ఈ పాటలో ద్వందార్థ పదాలు శృతిమించాయంటూ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛోళీ కే పీఛే క్యా హై  పాట హిట్‌ అయినప్పటికీ, దూరదర్శన్‌  ఆల్‌ ఇండియా రేడియోలో నిషేధించారు. ఈ పాటలో  నాటి బాలీవుడ్‌ గ్లామర్‌ క్వీన్‌ మాధురీ దీక్షిత్‌ నర్తించగా,ఆ పాటలోనూ డాన్‌గా నటించింది సంజయ్‌ దత్‌ కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే... సర్కే చునర్‌ తెరి సర్కే పాటలో కూడా ఖల్‌ నాయక్‌ ప్రస్తావన ఉండడం. అదేవిధంగా, 1994లో వచ్చిన  సెక్సీ సెక్సీ సెక్సీ ముఝే లోగ్‌ బోల్తీ పాట కూడా వివాదానికి గురైంది. ఇందులో ‘సెక్సీ’ అనే పదం వాడటం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాట లిరిక్స్‌ను ‘‘బేబీ బేబీ బేబీ’’గా మార్చాల్సి వచ్చింది.

అశ్లీలం ఒకటే కాదు ఇతర కారణాలు కూడా పాటలకుచిక్కులు తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తుంది. గత 2007లో విడుదలైన ఆజా నాచ్లే టైటిల్‌ ట్రాక్‌  కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని ఒక లైన్‌ కులవివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు రావడంతో ఈ పాటను మన తెలుగులో కూడా తరచుగా పాటలు వివాదస్పదం అవుతున్నాయి.

 ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలోని దబిడి దబిడి పాట కూడా నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. కాలం మారినా, వివాదాస్పద పాటల చరిత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే ఇప్పుడు ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ కంటెంట్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా, చిత్రసీమ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరింత నాణ్యమైన, బాధ్యతాయుతమైన కంటెంట్‌కు దారితీయొచ్చునని ఆశించవచ్చు.

 

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)