Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..
Breaking News
ఐటమ్ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?
Published on Wed, 09/02/2026 - 08:59
ప్రస్తుత ట్రెండింగ్ హీరోయిన్లలో కాయదు లోహర్ ఒకరు. తెలుగులో 'అల్లూరి' అనే మూవీ చేసినప్పటికీ.. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన చేసిన 'డ్రాగన్'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలా తమిళ, తెలుగు, మలయాళంలో వరస సినిమాలు చేస్తూ మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఈమె లేటెస్ట్ మూవీస్ 'ఇమ్మోర్టల్', ఐ యామ్ గేమ్.. ఈ శుక్రవారమే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు రెడీ అవుతోందట.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?)
రజనీకాంత్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉంటోంది. 'జైలర్'లో తమన్నా చేసిన పాట సెన్సేషన్ హిట్ అయ్యింది. 'కూలీ'లో పూజా హెగ్డే చేసిన మోనికా కూడా సూపర్ హిట్ అయింది. 'జైలర్ 2'లోనూ పూర్ణ ప్రత్యేక పాటలో నర్తించింది. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ 'ధర్మన్'. కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లు. మరో కీలక పాత్రలో శ్రియ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ మూవీలోనే ఒక ప్రత్యేక పాటలో నర్తించేందుకు కాయదు లోహర్‌ని అప్రోచ్ అయ్యారట. త్వరలో ఈ విషయమై క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు')
Tags : 1