Breaking News

'ఐకాన్ స్టార్‌తో షూట్‌.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్

Published on Tue, 02/10/2026 - 15:29

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్‌ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్‌ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంచితే అల్లు అర్జున్‌పై ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె.. అల్లు అ‍ర్జున్‌ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్‌ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కావేరి బారువా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్‌తో జరిగింది. ఈ సౌత్ స్టార్‌ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్‌కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. ‍అలాగే షేక్ హ్యాండ్స్‌ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‍‍‍అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్  బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)