Breaking News

డ్యాన్స్‌ అంటే ఇష్టం.. ఫ్యాన్స్‌ కోసం ఎంతైనా కష్టపడతా: హీరోయిన్‌

Published on Thu, 10/26/2023 - 13:56

ఒక సినిమా హిట్టయిందంటే వెంటనే దాని సీక్వెల్‌ గురించి చర్చ మొదలవుతుంది. చివరకు కథ రెడీ అయితే సీక్వెల్‌ పట్టాలెక్కడం ఖాయం. అలా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ మూవీ టైగర్‌కు గతంలో సీక్వెల్‌ తెరకెక్కింది. తాజాగా టైగర్‌ 2కి సీక్వెల్‌గా టైగర్‌ 3 తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి లేకే ప్రభు కా నామ్‌ సాంగ్‌ రిలీజైంది. ప్రీతమ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను అర్జిత్‌ సింగ్‌, నిఖిత గాంధీ పాడారు. తెలుగు, తమిళ వర్షన్స్‌ మాత్రం బెన్నీ దయాల్‌, అనూశ మణి పాడారు. ఇక ఈ పాటలో కత్రినా స్టెప్పులకు సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. హిందీ వర్షన్‌ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పాటకు వస్తున్న స్పందనపై కత్రినా స్పందించింది. ఒక ఆర్టిస్టుగా నాకు ఎక్కడలేని ప్రేమాభిమానాలు అందిస్తున్నారు. లెకె ప్రభు కా నామ్‌ పాటను ఎంతో హిట్‌ చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది.

నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. జనాలు మా నటనతో పాటు పాటలు, డ్యాన్సులు కూడా చూస్తారు. ఆ రెండు కూడా సినిమాలో భాగమే. పాటల వల్ల కూడా జనాలు సినిమాకు కనెక్ట్‌ అవుతుంటారు. అందుకే ఏ పాట అయినా దానికి ఎంతో బాగా డ్యాన్స్‌ చేయాలని ప్రయత్నిస్తుంటాం. ప్రేక్షకులను నిరాశపర్చకూడదని కష్టపడుతుంటాం' అని చెప్పుకొచ్చింది. కాగా టైగర్‌ 3 మూవీ దీపావళి కానుకగా నవంబర్‌ 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

చదవండి: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్‌ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)