Breaking News

తెలుగు వారి గురించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: నటి కస్తూరి

Published on Mon, 11/04/2024 - 12:44

హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే వేదికపై ఆమె తెలుగు వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నివశిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటి ఇస్తూ ఒక పోస్ట్‌ చేశారు.

'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్‌ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను. ఈ విషయం తెలియని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటిరోజున  నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. ఈ ట్రాప్‌లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.' అని తెలిపింది.

సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా అయితే,  ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి.

	తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)