Breaking News

కంగువ ఆడియో వేడుక రెడీ.. సూర్య కొత్త సినిమాలో మరాఠీ బ్యూటీ

Published on Fri, 10/18/2024 - 12:32

సౌత్‌ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి  శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్‌లో 10 భాషల్లో నవంబర్‌ 14వ తేదీన తెరపైకి రానుంది.

కంగువ ఆడియో ఆవిష్కరణ వేడుకను త్వరలో చైన్నెలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు సూర్య తన 44వ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌, స్టోన్‌ బెంచ్‌ స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

దీంతో నటుడు సూర్య తన 45వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీన్ని నటుడు ఆర్‌జే. బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్‌ వారియర్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ నవంబర్‌ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇకపోతే ఇందులో నటించే జాక్‌పాట్‌ను వర్ధమాన నటి కాశ్మీరా పరదేశీ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజం అయితే ఆమెకిది నిజంగా లక్కీఛాన్సే అవుతుంది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో  శివప్పు మంజల్‌ పచ్చై, పీటీసార్‌ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. 

అయితే అంతకు ముందే ఈ మరాఠీ బ్యూటీ తెలుగులో నర్తనశాల,వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలోనూ మెరిసింది. హిందీలో మిషన్‌ మంగళ్‌ చిత్రంలోనూ నటించింది. కాగా సూర్యతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ క్రేజీ చిత్రానికి హింట్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)