ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం.. కోటీ రూపాయలు మిస్‌ చేసుకున్న యువతి!

Published on Thu, 08/14/2025 - 15:09

బాలీవుడ్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్‌కు ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.  తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్‌మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? ‍అయితే ఈ స్టోరీ చదివేయండి.

తాజా ఎపిసోడ్‌లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి  కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది.  ఇంతకీ  ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.

ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్‌ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్‌ చేశాడు?

ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్‌ ఇవ్వగా.. కశీష్ సింఘాల్‌ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్‌ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)