Breaking News

మొన్నే రూ.6 కోట్ల కారు కొన్న హీరో.. ఇప్పుడేమో సైకిల్‌పై..

Published on Sun, 03/17/2024 - 11:44

యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఈ మధ్యే ఓ కారు కొన్నాడు. రూ.6 కోట్లు పెట్టి రేంజ్‌ రోవర్‌ కారు సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే డిక్కీలో పడుకున్న ఓ ఫోటో కూడా పోస్ట్‌ చేశాడు. కానీ నిన్న మాత్రం ఎంచక్కా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈమేరకు ఓ  వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన జనాలు.. ఏంటన్నా.. అంత పెద్ద కారు కొని ఇలా చిన్న సైకిల్‌ మీద తిరుగుతున్నావ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

రూ.6 ‍కోట్ల కారు కొని సైకిల్‌పై..
అయితే కార్తీక్‌ మాత్రం.. ఇలా సైకిల్‌ మీదే సెట్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నానంటున్నాడు. అలాగైతే ఆ ఆరు కోట్ల కారు మాకు ఇచ్చేసేయ్‌ అని ఓ అభిమాని అడగ్గా.. నా ఫ్రెండ్‌ ఒకరు కారు కావాలని తీసుకెళ్లాడు. తిరిగిచ్చేయగానే చెబుతానంటూ రిప్లై ఇచ్చాడు. కారు కొన్నాక కూడా ఎందుకని సైకిల్‌ తొక్కుతున్నావన్న ప్రశ్నకు.. పాత అలవాట్లను మానుకోవడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పుకొచ్చాడు.  

చేతిలో రెండు సినిమాలు
మొత్తానికి కార్తీక్‌ సైకిల్‌ మీద వెళ్తున్న వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కార్తీక్‌ ఆర్యన్‌ ప్రస్తుతం కబీర్‌ ఖాన్‌ డైరెక్షన్‌లో చందు చాంపియన్‌ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీ భూల్‌ భులాయా 2 సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇందులో నేషనల్‌ క్రష్‌ లిస్టులో కొత్తగా చేరిన హీరోయిన్‌ తృప్తి డిమ్రితో పాటు విద్యాబాలన్‌ ఉన్నారు. ఈ సినిమాకు అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు.

చదవండి: సిగ్గుండాలి అంటూ సందీప్‌ రెడ్డి వంగాపై విరుచుకుపడిన జావేద్‌ అక్తర్‌

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)