Breaking News

చెల్లి పెళ్లిలో డ్యాన్స్‌.. పైసా తీసుకోలే: బాలీవుడ్‌ హీరో

Published on Mon, 01/05/2026 - 09:16

బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్‌ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్‌ తేజస్వి కుమార్‌ సింగ్‌తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్‌ పంచుకున్నాడు. కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్‌.. తేరా మైన్‌ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. 

పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్‌
ఈ సినిమా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీక్‌, అనన్య పాండే 'ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్‌ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్‌ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.

సినిమా
కార్తీక్‌ ఆర్యన్‌ విషయానికి వస్తే.. ప్యార్‌ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్‌ ఓ, భూల్‌ భులయ్యా 2, భూల్‌ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్‌ 'తూ మేరీ మైన్‌.. తేరా మైన్‌ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ధురంధర్‌ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది.

 

 

చదవండి: కీర్తి సురేశ్‌ అక్కలో ఈ టాలెంట్‌ కూడా ఉందా?

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)