Breaking News

చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో

Published on Sat, 08/19/2023 - 08:12

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను  గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగ విడుదల చేశారు. ఆగష్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన గత చిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100' ట్రైలర్‌ని కూడా రామ్‌ చరణే రిలీజ్‌ చేశారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని కార్తికేయ  తెలిపారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్‌ మేరకు శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్‌ చెప్పానన్నారు.

ట్రైలర్‌ విడుదల అయ్యాక ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కార్తికేయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే చాలా బాధేస్తుందని కార్తికేయ అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని  అనడం వరకు ఓకేగానీ.. కొంతమంది పనికట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి దూషిస్తున్నారు. అలాంటి వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందని కార్తికేయ అన్నారు.  

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్‌ తిరిగిచ్చేసిన చిరంజీవి.. అందుకే ఆయన మెగాస్టార్‌!)

చిరంజీవినే కాదు అలా ఎవరినీ కూడా అనకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరమైనా కథ నచ్చే సినిమా తీస్తాం.. అనుకున్నంత స్థాయిలో అది ఆడకపోతే నేరమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం మాత్రమే. ఇలాంటి వాటికి  ఆయన ఏమాత్రం ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని ఇదీ అందరికీ తెలుసని కార్తికేయ తన అభిప్రాయం తెలిపారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు