Breaking News

సూపర్‌ హిట్‌ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌

Published on Thu, 04/04/2024 - 12:09

హీరో కార్తీ సూపర్‌ హిట్‌ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్‌ ఫిలిం మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై సుభాష్‌చంద్రబోస్‌ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్‌ అందుకుంది.

12 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌
తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్‌ సంస్థ అధినేత సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్‌ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్‌లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్‌ ఉందన్నారు.

కెమిస్ట్రీ వర్కౌట్‌ అయింది
సినిమాలో లవ్‌, యాక్షన్‌, చేజింగ్స్‌, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్‌ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు.

చదవండి: హీరోయిన్‌ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)