బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం: కార్తీ
Published on Wed, 09/09/2026 - 08:06
కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం సర్ధార్ – 2. ఈయన 2022లో నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి ఫ్రీక్వెల్, సీక్వెల్ చిత్రం సర్ధార్ 2 అని నటుడు కార్తీ పేర్కొన్నారు. పీఎస్.మిత్రన్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్ మెంట్ సంస్థలపై ఎస్.లక్ష్మణన్, ఇషాన్ సక్సేనా కలిసి నిర్మించిన ఈ భారీ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటుడు ఎస్ జే.సూర్య,నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్, రజీషా విజయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జార్జ్ సీ.విలియంస్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన సర్ధార్ –2 చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్ధార్ 2 చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది సర్ధార్ చిత్రానికి ప్రీక్వెల్, సీక్వెల్ గా ఉంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం. హాలీవుడ్ చిత్రాలను రీచ్ అవ్వాలనే ప్రయత్నమే ఈ చిత్రం. యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం యూనిట్ వర్గాలు చాలా శ్రమించారు.
కార్లు, ట్రైన్ చేజింగ్ వంటి సన్నివేశాల కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ చాలా కష్టపడ్డారు. దర్శకుడు మిత్రన్ అయితే షూటింగ్ పూర్తి అయిన తరువాత ఏడాది పాటు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపైనే దష్టి పెట్టారు. నటి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించారు. చిత్ర జనరంజకంగా వచ్చింది అని నటుడు కార్తీ పేర్కొన్నారు.
Tags : 1