Breaking News

సడెన్‌గా సంక్రాంతి రేసులోకి వచ్చేసిన 'కార్తీ' సినిమా

Published on Sat, 01/10/2026 - 18:49

కోలీవుడ్‌లో సడెన్‌గా హీరో కార్తీ సినిమా రేసులోకి వచ్చేసింది. విజయ్‌ మూవీ జన నాయగన్‌ వాయిదా పడటంతో పొంగల్‌ రేసులో పెద్దగా సినిమాలు లేవు. తమిళనాట ప్రస్తుతం శివ కార్తికేయన్‌ ‘పరాశక్తి’ మాత్రమే ఉంది. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన మేకర్స్‌ సడెన్‌గా 'అన్నగారు వస్తారు' విడుదల తేదీని ప్రకటించారు.  వాస్తవంగా ఈ మూవీ కూడా   డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. పలు ఆర్థిక కారణాలతో వాయిదా పడింది. 

తాజాగా ఆ సమస్యలన్నీ పూర్తి కావడం వల్ల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో జనవరి 14న ‘వా వాతియార్‌’(అన్నగారు వస్తారు)ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, తెలుగు వర్షన్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలదే. ఇక్కడ థియేటర్స్‌ దొరకడం కష్టం కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగులో విడుదల కావచ్చు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై  కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. కామెడీతో పాటు యాక్షన్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.

ఎందుకు వాయిదా పడింది..?
అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ, ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ సమస్య లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)