Breaking News

ఓటీటీకి స్టార్ హీరో మూవీ.. నెల రోజుల్లోపే!

Published on Fri, 11/24/2023 - 13:56

కార్తీ హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్‌’. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో దీపావళి సందర్భంగా నవంబర్ 10న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. తమిళనాడులోని ఒక దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. 

విడుదలై నెలరోజులు కాకముందే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 న లేదా 8న  నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటన  చేయనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

అసలు  కథేంటంటే..
జపాన్‌ ముని అలియాస్‌ జపాన్‌(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని  రాయల్‌ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్‌ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్‌ రవికుమార్‌) షేర్‌ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

ఈ కేసు విచారణకై స్పెషల్‌ ఆఫీసర్స్‌ భవాని(విజయ్‌ మిల్టన్‌), శ్రీధర్‌(సునీల్‌) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం వెతుకుతుంటారు.  అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్‌ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్‌ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్‌ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే జపాన్‌ సినిమా చూడాల్సిందే. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)