Breaking News

దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ

Published on Sun, 05/11/2025 - 12:40

సినిమాలు ఎ‍ప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.

(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్‌ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్‌..)

గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.

'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా'

'ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ‍ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను'

'ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)