Breaking News

ఈవెంట్‌ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

Published on Mon, 03/03/2025 - 16:47

శాండల్‌వుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్‌కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని  మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.

(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)

రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు శాండల్‌వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు.
 

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)