Breaking News

సినిమా టికెట్‌ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక

Published on Fri, 03/07/2025 - 13:25

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య 2025-26కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాజాగా రూ. 4,08,647 కోట్ల బడ్జెట్‌ను  సభలో ప్రస్తావించారు. అయితే, కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్‌ విధించే ప్రణాళికల అంశాన్ని  చర్చించారు. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సిద్ధ రామయ్య ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది.

కర్ణాటక చిత్ర రంగాన్ని ప్రోత్సాహించేందుకు సినిమా టికెట్‌ ధరలను రూ.200గా ఉండాలని నిర్ణయించాలనుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లతో పాటు ఇతర థియేటర్స్‌లలో కూడా ఇదే రేటు ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ అందుబాటులో ధరలు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్ధ రామయ్య పేర్కొన్నారు. సినిమా విడుదల రోజే కాదు.. ప్రీమియర్‌ షోలు ప్రదర్శించినా ఇదే రేటుతో టికెట్లు ధరలు ఉండాలని ఆయన తెలిపారు. భారీ బడ్జెట్‌ పెట్టి చిత్రాలు నిర్మించినా సరే ఇక నుంచి టికెట్‌ ధర మాత్రం రూ. 200 మించి ఉండకూడదని చెప్పారు.

కర్ణాటక సినిమా ఇండస్ట్రీ కోసం తాము ఎప్పటికీ ముందు ఉంటామని సీఎం అన్నారు. ఈ క్రమంలో మైసూర్‌లో ఒక భారీ ఫిలిం సిటీని నిర్మాస్తామని చెప్పారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. నిర్మాణం కోసం రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)