కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
Breaking News
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు
Published on Tue, 01/13/2026 - 08:05
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సీన్ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీజర్ బాగుందని అందులో యశ్ లుక్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.., కారులో యశ్‌తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి.
కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా విభాగం ఈ టీజర్‌పై భగ్గుమంది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై చర్యలు తీసుకోవాలన్నారు.
విమర్శలరు రావడంతో టీజర్‌పై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్ చేశారు. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నా అన్నారు. ఆ సీన్‌ను శృంగార దృశ్యంగా చూడకిండి అంటూ హితవు పలికారు. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని గీతూ మోహన్‌దాస్ చెప్పారు. టాక్సిక్ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
Tags : 1