Breaking News

ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!

Published on Mon, 06/15/2026 - 23:20

బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్‌తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్‌ హిట్‌ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్‌ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు.  అయితే ఈ ఈవెంట్‌లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్‌తో, గులాబీ రంగు సూట్‌లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్‌ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్‌కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్‌తో పాటు వింటేజ్ లుక్‌ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్‌ బెబో అని ఎందుకంటారు? తన లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్‌కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.

అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్‌లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్‌ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్‌కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)