Breaking News

సినిమాలు లేకపోతే మీ పరిస్థితేంటి?.. కరీనా కపూర్

Published on Mon, 01/23/2023 - 17:04

బాయ్‌కాట్‌ బాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా వస్తున్న బాయ్‌కాట్ వివాదం మరోసారి షారుక్ ఖాన్ మూవీ పఠాన్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందంటే దీని ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న  ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి, సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. 

సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడ లభిస్తుందని కరీనా ప్రశ్నించారు. ఇటీవల కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. 'బాయ్‌కాట్‌ బాలీవుడ్ ట్రెండ్‌ను ఏమాత్రం ఒప్పుకోను. ఒకవేళ సినిమాలపై నిషేధం విధిస్తే..  మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా దొరుకుతుంది. మీ జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వినోదం ప్రతి ఒక్కరికీ అవసరం.' అని అన్నారు.

రెండేళ్లుగా ఈ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తాజాగా మరోసారి ట్విట్టర్‌లో ట్రెండ్ పెరిగింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మరింత పుంజుకుంది.షారుఖ్ ఖాన్  పఠాన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర వంటి అనేక పెద్ద చిత్రాలు బాయ్‌కాట్‌ను ఎదుర్కొన్నాయి.  మొదట నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత సినిమాలు విడుదలయ్యే సమయంలో నిషేధించాలంటూ ట్రెండింగ్‌ చేస్తున్నారు.  సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు.

కరీనా కపూర్ దర్శకుడు సుజోయ్ ఘోష్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌లో కనిపించనుంది. ఇందులో విజయ్ వర్మ,  జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా, దర్శకుడు హన్సల్ మెహతా చిత్రంలో కనిపించనుంది. 


 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)