Breaking News

రేవ్‌ పార్టీ.. హేమకు మెసేజ్‌ చేశా.. తన గొయ్యి తనే తీసుకుంది: కరాటే కల్యాణి

Published on Thu, 05/23/2024 - 18:30

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్‌ అయిన హేమ.. తూచ్‌, అంతా అబద్ధం, నేను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్‌ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది. 

ఎవరినీ క్షమించేది లేదని..
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్‌ టెస్ట్‌లో హేమ డ్రగ్స్‌ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్‌ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్‌ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. 

గొడవలు..
ఇంతలోనే హేమ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్‌ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్‌ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్‌ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.

తన గోతి తనే తీసుకుంది
ఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్‌లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్‌లో ఫామ్‌ హౌస్‌లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్‌ విడుదల

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)