Breaking News

అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తా.. పేరెంట్స్‌ అర్థం చేసుకుంటారు

Published on Sun, 10/12/2025 - 18:48

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరాఖాన్‌ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్‌ వ్లాగ్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్‌ ఇంటికి వెళ్లి చిట్‌చాట్‌ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్‌ టక్కర్‌ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్‌ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్‌ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్‌ ఎక్కువ ఫేమస్‌ అయిపోయాడు. 

ఫ్యామిలీ హౌస్‌.. కానీ!
కరణ్‌ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్‌కు బదులుగా దిలీప్‌ను గుర్తుపట్టి హాయ్‌ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్‌ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్‌ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్‌ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్‌ డోర్‌ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్‌.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్‌? అని సరదాగా అడిగింది. 

నాకింకా పెళ్లవలేదు
అందుకు కరణ్‌ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్‌ రూమ్స్‌ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్‌ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్‌ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్‌ రూమ్‌ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్‌ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.

సీరియల్స్‌.. రియాలిటీ షోలు
కరణ్‌ టక్కర్‌.. లవ్‌ నే మిలాది జోడి, ఏక్‌ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. డ్యాన్స్‌ రియాలిటీ షో 'జలక్‌ దిక్‌లాజా 7'వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయగా ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాడు. 'ద వాయిస్‌', 'నాచ్‌ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్‌ ఆప్స్‌, ఖాకీ వంటి వెబ్‌ సిరీస్‌లలో యాక్ట్‌ చేశాడు. తన్వి: ద గ్రేట్‌ సినిమాలోనూ నటించాడు.

 

 

చదవండి: గృహప్రవేశం చేసిన సామ్‌.. కొత్తింట్లో పూజలు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)